News January 27, 2025
విశాఖ కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737910871649_1100-normal-WIFI.webp)
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యరావు, రాజకీయ ప్రముఖులు, నేవీ అధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆకట్టుకున్నాయి.
Similar News
News February 13, 2025
‘ఆ కేసులను త్వరితంగా పరిష్కరించాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739361696731_20522720-normal-WIFI.webp)
హిట్ & రన్ నష్ట పరిహార కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటశేషమ్మ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో రవాణా శాఖ, పోలీస్ అధికారులతో బుధవారం సమావేశం అయ్యారు. హిట్ అండ్ రన్ కేసుల విషయంలో సత్వరమే జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్కు పంపాలని ఆదేశించారు. నష్టపరిహారం క్లెయిమ్ దరఖాస్తులలో లోపలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
News February 12, 2025
వాట్సాప్ ద్వారా సింహాచలం దర్శనం టికెట్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739345690722_20522720-normal-WIFI.webp)
సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనం టికెట్స్, ఆర్జిత సేవ టికెట్స్ ఆన్లైన్ ద్వారానే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా కూడా లభ్యమవుతున్నాయని ఈవో త్రినాథ్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9552300009 నంబర్కు వాట్సాప్ చేసి టికెట్స్ బుకింగ్ చేసుకొనవచ్చు అన్నారు. అలా బుకింగ్ చేసుకున్న టికెట్స్ కాపీను తీసుకొని దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.
News February 12, 2025
విశాఖలో హత్యకు గురైన MRO భార్యకు ఉద్యోగం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739334183339_1100-normal-WIFI.webp)
విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో రమణయ్య గతేడాది ఫిబ్రవరి 2న విశాఖలో హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్గా నియామక పత్రం అందించారు.