News September 30, 2024
విశాఖ కానిస్టేబుల్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్
ఎండాడ మహిళా పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ కనకల వెంకట నరసింహమూర్తి ఈనెల 22న విధులకు వెళ్లారు. డ్యూటీ అనంతరం నరసింహమూర్తి ఇంటికి రాలేదు. అతని భార్య ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో స్టేషన్లో ఆరా తీసి మిస్సింగ్ కేసు పెట్టింది. అయితే ఆదివారం నరసింహమూర్తి ఇంటికి చేరుకున్నాడు. ఆ సంగతి తెలుసుకున్న SI వెళ్లి ఆరా తీయగా పనిఒత్తిడితో ప్రశాంతత కోసం తిరుపతి, విజయవాడ దైవ దర్శనానికి వెళ్లినట్లు అతను తెలిపాడు.
Similar News
News October 10, 2024
పనుల్లో జాప్యం చేయవద్దు: కలెక్టర్
చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపుతూ పనుల్లో జాప్యం చేయడం సరికాదని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. విశాఖ జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ గ్రామీణ పథకాలపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికయుతంగా పనిచేయాలన్నారు.
News October 9, 2024
విశాఖ నగరంలో ఏర్పాటు కానున్న TCS..ఎంపీ స్పందన
విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌కు విశాఖ ఎంపీ భరత్ శుభాకంక్షాలు తెలిపారు. ఈ మేరకు X వేదికగా స్పందిస్తూ టాటా గ్రూప్‌ను ఒప్పించారు. టీసీఎస్ ఏర్పాటు అయితే సుమారు పదివేల మంది స్థానిక యువతకి ఉపాధి లభిస్తుంది. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని చూపిస్తున్న చొరవకు ఎంపీగా అవసరమైనదంతా నేను చేస్తాను అని పేర్కొన్నారు.
News October 9, 2024
విశాఖ: సింహాద్రి అప్పన్న సన్నిధిలో సినీ హీరో
సినీ హీరో సుదీర్ బాబు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విశాఖ వచ్చిన మూవీ టీమ్ ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో మాట్లాడారు. అనంతరం సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.