News February 15, 2025

విశాఖ: కామాంధుడి కోరికలకు వివాహిత బలి

image

గోపాలపట్నంలో శుక్రవారం జరిగిన వివాహిత ఆత్మహత్య ఘటన కలిచివేసింది. తన వికృత చేష్టలతో భార్యను దారుణంగా హింసించిన భర్త.. చివరకు ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. పోర్న్ వీడియోలకు బానిసై భార్యతో మానవ మృగంలా ప్రవర్తించాడు. లైంగిక వాంఛకు ప్రేరేపించే మాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. మానసికంగా ఎంతో వేదనను అనుభవించిన ఆమె చివరకు ఉరి వేసుకుని తన జీవితానికి ముగింపు పలికింది

Similar News

News March 19, 2025

VZM: చిన్న శ్రీను కుమారుడి మృతి

image

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ నేడు మృతి చెందాడు. 2020లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.

News March 19, 2025

గుర్ల: పాము కాటుతో ఇంటర్ విద్యార్ధిని మృతి

image

పాము కాటుతో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండలం ఫకీర్ కిట్టలి పంచాయతీ బూర్లే పేటలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ద్వారపూడి మౌనిక అనే విద్యార్థినికి అర్ధరాత్రి ఇంటివద్దనే నాగుపాము కాటువేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News March 19, 2025

‘భర్త అనుమానించడం వలనే హత్య చేశా’

image

విశాఖలో ఓ తల్లి కన్న కూతురినే హతమార్చింది. పెద్దగదిలిలో జరిగిన ఈ హత్య కేసులో నిజానిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పాప పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా తెలుస్తోంది. భర్త అనుమానంతో బెడ్ రూమ్‌లో కూడా CC కెమెరా పెట్టాడని దీంతో మనస్తాపం చెంది కూతురిని తల దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితురాలు శిరీష పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్లు ఆరిలోవ CI మల్లేశ్వరరావు తెలిపారు.

error: Content is protected !!