News August 1, 2024
విశాఖ: కామాంధుడైన తండ్రికి జీవిత ఖైదు

కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రి కేసులో విశాఖ స్పెషల్ ;Yక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధించింది. 2020 సంవత్సరంలో కోల్‌కతా నుంచి విశాఖ వచ్చిన నిందితుడు భార్య క్యాన్సర్‌తో చనిపోయిన తరువాత కన్న కూతురుపై కన్నేసాడు. రాత్రి సమయంలో కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడేవాడు. బాధితురాలు గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ కేసుపై కోర్టు తీర్పునిచ్చింది.
Similar News
News January 23, 2026
నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష

విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా భద్రత, గంజాయి రవాణా అడ్డుకట్ట, సైబర్ నేరాల నియంత్రణలో సాంకేతికత వాడకంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నగర DCPలు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News January 22, 2026
ఈ నెల 29న విడుదల కానున్న ఏపీ మత్స్యకారులు

బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులను ఈ నెల 29న విడుదల చేసి భారత్‌కు పంపనున్నట్లు Bangladesh Coast Guard ప్రకటించిందని ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది ఉన్నారు. అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు.
News January 22, 2026
ఏయూలో పాలన గాడి తప్పిందా?

ఖరగ్‌పూర్ ఐఐటీలో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను ఏయూకి వీసీగా ప్రభుత్వం నియమించింది. అయితే వీసీ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులను కలుపుకొని ముందుకు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఈడీ విద్యార్థి మృతి, వీసీని నేరుగా కలవొద్దంటూ సర్క్యులర్లు, తాజాగా ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు మెస్‌లో భోజనం నిలిపివేయడంతో వైఫల్యాలు కనిపిస్తున్నాయి.


