News December 6, 2024
విశాఖ: కామాంధునికి పాతికేళ్ల జైలు శిక్ష

బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధునికి విశాఖపట్నం పోక్సో కోర్టు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది. తీర్పులో భాగంగా నిందితునికి 25 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.1,25,000 జరిమానా విధించింది. సబ్బవరం మండలానికి చెందిన ఓ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో ప్రవేశపెట్టగా శిక్ష విధించారు.
Similar News
News March 16, 2026
విశాఖ: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లకు 397 వినతులు

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలకు గడువులోగా పరిష్కారం చూపకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై సాధారణ పీజీఆర్ఎస్‌కు 397 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ క్లినిక్‌కు 119, జీవీఎంసీకి చెందినవి 94, పోలీసు 26, ఇతర శాఖలకు సంబంధించినవి 158 వినతులు ఉన్నాయి.
News March 16, 2026
పద్మనాభంలో భారీగా కోడిపందాలు.. 73 మంది పట్టివేత

పద్మనాభ మండలం శివారు ప్రాంతం రాయల్ గార్డెన్స్‌లో అర్ధరాత్రి కోడిపందాలు నిర్వహిస్తుండగా సిటీ టాస్క్‌ఫోర్స్ పద్మనాభం పోలీసులు పట్టుకున్నారు. కోడిపందాలు నిర్వహణ ప్రాంతంలో 73 మందిని అదుపులోకి తీసుకోగా 7,56,000 నగదు, ఎనిమిది కారులు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. భారీ ఎత్తున కోడిపందాలు నిర్వహించడం స్థానికంగా సంచలమైంది.
News March 16, 2026
నేటి నుంచి ఒంటి పూట బడులు: డిఈవో

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి ఒంటిపూట బడులు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ఎండలును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రతీ పాఠశాల తప్పక నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


