News April 11, 2025

విశాఖ-కిరండూల్ పాసింజర్ అరకు వరకే

image

విశాఖ-కిరండూల్-విశాఖ పాసింజర్ అరకు వరకే నడుస్తాయని వాల్తేర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. కేకే లైన్‌లోని పాడువ – దార్లిపుట్ మధ్య డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో‌ విశాఖ-కిరండూల్ పాసింజర్ (58501) రైలు ఏప్రిల్ 14 నుంచి 22 వరకు విశాఖ నుంచి అరకు వరకే నడుస్తుందని తెలిపారు. తిరుగు ప్రయాణం కిరండూల్-విశాఖ పాసింజర్ (58502) రైలు ఈ నెల 14 నుంచి 22 వరకు అరకు నుంచి విశాఖ వెళ్తుందన్నారు.

Similar News

News April 17, 2026

HYD: కాగితాల్లో 501.. నేల మీద 185..! (2)

image

చెరువుల బదిలీలో భారీ స్కామ్ జరిగిందా? GO 120 (2010) ప్రకారం 501 చెరువులను గుర్తించి, అందులో 399 మున్సిపల్ శాఖకు అప్పగించారు. కానీ పదేళ్లలోనే ఈ సంఖ్య 185కి ఎలా పడిపోయింది? హిమాయత్‌సాగర్ పరిధిలో 40 శాతం నీటి విస్తీర్ణం మాయమై, కాంక్రీట్ కోటలు వెలిశాయి. హుడా మాస్టర్ ప్లాన్ లెక్కలకూ, ఇప్పటి పరిస్థితికీ పొంతన లేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న <<19672164>>చెరువులు క్షేత్రస్థాయిలో<<>> కనిపించడం లేదు.

News April 17, 2026

క్రీడాకారులకు ‘శాప్’ అండగా ఉంటుంది: భరణి

image

ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఎండీ ఎస్. భరణితో కృష్ణా జిల్లా టైక్వాండో అసోసియేషన్ కోశాధికారి అశ్విని గోగులమూడి, సభ్యురాలు సరితా దేవి శుక్రవారం భేటీ అయ్యారు. బెంగళూరులో జరిగిన పారా జాతీయ టైక్వాండో పోటీలలో రాష్ట్ర క్రీడాకారులు ప్రశాంత్, షణ్ముఖ్ సాధించిన విజయాలను వారు ఎండీకి వివరించారు. క్రీడాకారుల ప్రతిభను అభినందించిన భరణి, వారికి శాప్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News April 17, 2026

అంబానీని దాటేసి.. ఆసియా కుబేరుడిగా అదానీ

image

గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆయన అగ్రస్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం అదానీ నెట్‌వర్త్ $92.6 బిలియన్లుగా ఉండగా, అంబానీ ఆస్తి $90.8 బిలియన్లుగా నమోదైంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 19వ స్థానంలో, అంబానీ 20వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా మస్క్ ($656B) కొనసాగుతున్నారు.