News September 28, 2024
విశాఖ- కిరండూల్ రైళ్లు దంతెవాడ వరకు కుదింపు
విశాఖ- కిరండూల్ మధ్య నడుస్తున్న రైళ్లు వర్షాల కారణంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు దంతెవాడకు కుదించినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి దంతెవాడ తిరుగు ప్రయాణంలో దంతెవాడ నుంచి విశాఖకు చేరుకుంటాయని తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News October 13, 2024
విజయనగరం చరిత్ర భవిష్య తరాలకు తెలియాలి : మంత్రి
మన సంస్కృతి, చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం ఉత్సవాల్లో భాగంగా, శ్రీ పైడితల్లి అమ్మవారి చరిత్ర, విజయనగరం గొప్పదనాన్ని వివరిస్తూ రూపొందించిన లేజర్ షోను కోట వద్ద మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విజయనగరం గొప్ప చారిత్రక సంపదకు ఘనమైన చరిత్రకు నిలయమని పేర్కొన్నారు. ఈ చరిత్రను నేటి తరానికి తెలియజేయాలన్నారు.
News October 13, 2024
విజయనగరం జిల్లాలో స్పీకర్ పర్యటన
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విజయనగరంలో ఆదివారం పర్యటించనున్నారు. స్థానిక అయోధ్య మైదానంలో ఉదయం 11 గంటలకు విజయనగరం ఉత్సవాలను స్పీకర్ ఘనంగా ప్రారంభించనున్నారని కమిటీ నిర్వాహుకులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీపైడితల్లి ఆలయం నుంచి అయోధ్య మైదానం వరకు ఉత్సవాల ప్రారంభోత్సవ ర్యాలీ జరుగుతుందని చెప్పారు.
News October 12, 2024
విజయనగరం: మద్యం షాపుల డ్రా స్థలం మార్పు
నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం షాపుల డ్రా స్థలం మార్పు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ నాథుడు తెలిపారు. సుజాత కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించాల్సిన డ్రా విధానం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 14న కలెక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో డ్రా తీస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థల మార్పును దరఖాస్తుదారులు గమనించాల్సిందిగా ఆయన సూచించారు.