News May 2, 2024
విశాఖ: కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కుమార్తె మృతి
పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేసుకోగా కుమార్తె మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో పీఎం పాలెంలో నివాసం ఉంటున్నారు. కుమార్తె ప్రవర్తన నచ్చక తీవ్రమనస్తాపం గురై ఎలుకల మందు తాగారు. ఇది చూసి చిన్నారులు సైతం ఎలుకల మందు తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది.
Similar News
News January 27, 2025
చెన్నైలో విశాఖ డాక్టర్ అరెస్ట్
విశాఖలో కిడ్నీ ఆసుపత్రి నిర్వహిస్తున్న డా.రాజశేఖర్‌ను చెన్నైలో హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారం రోజులుగా హైదరాబాద్, చెన్నై కేంద్రాలుగా నడుస్తున్న కిడ్నీ రాకెట్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఈ రాకెట్‌లో విశాఖకు చెందిన డా.రాజశేఖర్ ఓ ముఠాను ఏర్పాటు చేసి కిడ్నీల మార్పిడికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతనిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.
News January 27, 2025
తగరపువలస ఘటనలో మరో చిన్నారి మృతి
తగరపువలసలోని ఆదర్శనగర్‌లో పురుగుమందు తాగిన ఘటనలో <<15257483>>విషాదం <<>>చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఇషిత(5) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల భార్యాభర్తల గొడవతో మనస్తాపం చెందిన వివాహిత మాధవి(25) ఇద్దరి కుమార్తెలతో పాటు పురుగు మందు తాగిన విషయం తెలిసిందే. దీంతో మాధవితో పాటు చిన్న కుమార్తె శనివారం మృతి చెందింది. మృతిరాలి భర్త రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగా పనిచేస్తున్నాడు.
News January 27, 2025
విశాఖ కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యరావు, రాజకీయ ప్రముఖులు, నేవీ అధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆకట్టుకున్నాయి.