News August 16, 2024

విశాఖ: కుళ్లిన స్థితిలో DEAD BODY లభ్యం

image

ఆనందపురం మండలం గండిగుండం గ్రామ సమీపంలో శుక్రవారం కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. హత్యా.., ఆత్మహత్యనా అనేది తెలియాల్సి ఉందన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 18, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 135 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌‌కు సోమవారం 135 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

image

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.