News August 16, 2024

విశాఖ: కుళ్లిన స్థితిలో DEAD BODY లభ్యం

image

ఆనందపురం మండలం గండిగుండం గ్రామ సమీపంలో శుక్రవారం కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. హత్యా.., ఆత్మహత్యనా అనేది తెలియాల్సి ఉందన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News September 20, 2024

వరద బాధితులకు నెల జీతం విరాళంగా ఇచ్చిన స్పీకర్

image

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయవాడ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం చెక్కును సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ సామర్థ్యానికి తగ్గట్టు సీఎం రిలీఫ్ ఫండ్కు సహాయం అందించాలని కోరారు. వరద ప్రాంత బాధితులకు ఆ నిధులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

News September 19, 2024

సింహాచలం ఈవోగా వి.త్రినాథరావు

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానమునకు కార్యనిర్వహణ అధికారిగా వి.త్రినాథరావును నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఉత్వర్వుల జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈవోగా పని చేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తన మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు తిరిగి వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో త్రినాథరావు వచ్చారు.

News September 19, 2024

స్వర్ణాంధ్ర-2047పై సమీక్ష నిర్వహించిన విశాఖ కలెక్టర్

image

స్వర్ణాంధ్ర-2047పై అందరికీ అవగాహన ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం స్వర్ణాంధ్ర-2047పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐదేళ్లలో సాధించబోయే ప్రగతిపై ప్రణాళికలతో కూడిన నివేదికలను రూపొందించాలన్నారు. ప్రతి ఏటా 15% ఆర్థిక పురోగతి కనిపించాలన్నారు.