News June 22, 2024
విశాఖ: కూరగాయల ధరలపై జేసీ సమీక్ష
పెరుగుతున్న కూరగాయల ధరలపై కలెక్టరేట్‌లో విశాఖ జేసీ వివిధ శాఖల అధికారులు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. టమాటో, ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి కారణంగా టమాటో దిగుబడి తగ్గినట్లు అధికారులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. మార్కెటింగ్ శాఖ జిల్లాకు కేటాయించిన రివాల్వింగ్ ఫండ్‌తో ఇతర జిల్లాల నుంచి టమాటా, ఉల్లి కొనుగోలు చేసి తక్కువ ధరలకు వినియోగదారులకు అందించాలన్నారు.
Similar News
News November 7, 2024
విశాఖ: నైపుణ్య శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
విశాఖలోని RTC కాంప్లెక్స్ వద్ద ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లో IIATP ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండస్ట్రియల్ వెల్డర్, పైప్ ఫిట్టర్, ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్, ITI విద్యార్హత కలిగిన వారు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. 60 నుంచి 80 రోజులు శిక్షణలో భాగంగా ఉచిత వసతి, భోజనం సదుపాయాలను కల్పిస్తారు. ఈ నెల 15వ తేదీలోగా అప్లై చేసుకోవాలని కోరారు.
News November 7, 2024
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ
విశాఖలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్‌కు గురువారం శంకుస్థాపన చేశారు. చినగదిలిలో రెండు ఎకరాల భూమిని గత ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. ఈ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంత బాలికలు ఒలంపిక్స్ స్థాయికి ఎదిగేలా శిక్షణ అందిస్తామని అన్నారు. బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అకాడమీ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
News November 7, 2024
వందేభారత్ Vs జన్ సాధారణ్.. మీ ఓటు దేనికి?
విజయవాడ-విశాఖ మధ్య ప్రారంభించిన ‘జన్ సాధారణ్'(అన్నీ జనరల్) రైళ్లకు విశేష ఆదరణ లభిస్తుండగా.. విశాఖ మీదుగా వెళ్తున్న వందేభారత్‌కు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. విశాఖ, నర్సీపట్నం, దువ్వాడ, అనకాపల్లి నుంచి సామాన్యులు, చిరుద్యోగులు రాకపోకలు సాగిస్తారు. సరిపడా రైళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వందేభారత్‌కు బదులు జన్ సాధారణ్ రైళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి మీరు దేనికి ఓటేస్తారు?