News January 29, 2025
విశాఖ కేంద్ర కారాగారంలో అందుబాటులోకి ఆన్లైన్ ములాఖత్

విశాఖ కేంద్ర కారాగారంలో ఆన్లైన్లో ముందుగా ములాఖత్ రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు జైలు సూపరింటెండెంట్ మహేశ్ బాబు తెలిపారు. https://eprisons.nic.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుని ముందుగా ములాఖత్ డేట్ తీసుకోవచ్చని తెలిపారు. ఒక్కో ములాఖాత్కు ముగ్గురు విజిటర్స్ సంబంధిత ఖైదీని కలిసి మాట్లాడుకునే సదుపాయం ఉందన్నారు. రిమాండ్ నిందితులకు వారానికి రెండు ములాఖత్లు అందుబాటులో ఉంటాయన్నారు.
Similar News
News November 25, 2025
ఫార్మా బస్సులకు గాజువాకలోకి నో ఎంట్రీ

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు
News November 25, 2025
విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివారణ చర్యలను బలోపేతం చేయాలి’

లింగ ఆధారిత వివక్షపై పోరాటం చేసేందుకు పౌరులందరిలో బాధ్యత పెరగాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న జెండర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.