News February 2, 2025

విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ప్రధాన నిందితుడు అరెస్ట్

image

విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేర్‌లో శనివారం టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ప్రధాన నిందితుని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ ముద్దాయి ద్వారా బెట్టింగ్ బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందన్నారు. త్వరలో వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ బెట్టింగ్ ద్వారా 178 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

Similar News

News February 24, 2026

కల్తీ పాలు తాగిన బాలుడు కేజీహెచ్‌లో మృతి

image

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వెంకట్(7) మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. కేజీహెచ్ సూపరిండెంట్ ఐ.వాణి మాట్లాడుతూ.. 18వ తేదీన కాకినాడ నుంచి ఈ బాలుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌లో జాయిన్ చేశారన్నారు. వచ్చేటప్పటికే రెండు కిడ్నీలు పాడయ్యాయని, ఇప్పటి వరకు 60 సార్లు డయాలసిస్ చేశామని, అయినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదని ఆమె Way2Newsకు వివరించారు.

News February 24, 2026

సర్క్యులర్ ఎకానమీతో 10 మిలియన్ల ఉద్యోగాలు: పట్టాభిరామ్

image

విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె.పట్టాభిరామ్ మాట్లాడారు. 2050 నాటికి సర్క్యులర్ ఎకానమీ ద్వారా 10 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏపీలో ఐదు సర్క్యులర్ ఎకానమీ పార్కులు, వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ హరేంధీర ప్రసాద్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించగా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు.

News February 24, 2026

విశాఖ పోలీసుల అదుపులో క్రిప్టో కరెన్సీలో కేసులో కీలక సూత్రధారి

image

క్రిప్టో కరెన్సీ పేరుతో విశాఖలో వందల కోట్లు వసూలు చేసిన కీలక సూత్రధారుడుని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితులు సోమవారం విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు PGRSలో ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించి రవి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.రవి కిరణ్ తప్పు చేయలేదని సీఐ భవానీ ప్రసాద్ వాదిస్తుండగా.. బాధితులు మాత్రం మేము అతనికే సొమ్ము చెల్లించామని ఆధారాలు చూపిస్తున్నారు.