News August 10, 2024

విశాఖ: గవర్నర్ ఆదేశాలపై స్పందించిన వీసీ

image

ఏయూ కంప్యూటర్ సైన్స్ విభాగంలో దశాబ్దానికి పైగా ఒకే స్థానంలో ఉంటూ విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న బోధనేతర సిబ్బంది అవినీతిపై విద్యార్థుల తల్లిదండ్రులు గవర్నరుకు ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి ఏయూకు ఆదేశాలు రావడంతో ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్ శశిభూషణరావు స్పందించారు. తక్షణమే ఆ విభాగంలో పనిచేస్తున్న 16 మంది సిబ్బందిని వేరే విభాగాలకు బదిలీ చేశారు.

Similar News

News September 18, 2024

విశాఖ: పర్యాటక అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

image

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న‌ అవార్డులు అందజేసేందుకు వీలుగా 2023- 24 సంవత్సరానికి అర్హులైన పర్యాటక రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. www.aptourism.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏపీ టూరిజం అథారిటీ, 5వ ఫ్లోర్, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడ చిరునామాకు అందచేయాలన్నారు.

News September 18, 2024

ఏపీలో మొదటి స్థానంలో విశాఖ రైల్వే స్టేషన్

image

ఆదాయ ఆర్జనలో విశాఖ రైల్వే స్టేషన్ ఏపీలో మొదటి స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రాకపోకల ద్వారా రూ.564 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏపీలో టాప్ 30 రైల్వేస్టేషన్లలో కూడా విశాఖ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. తిరుపతి విజయవాడ స్టేషన్‌లతో పోలిస్తే ప్రయాణికుల రాకపోకల విషయంలో వెనుకంజలో ఉంది.

News September 17, 2024

విశాఖలో ఆన్‌లైన్‌ వ్యభిచారం.. ఐదుగురు అరెస్ట్

image

విశాఖలోని ఆన్‌లైన్‌లో జరుగుతున్న వ్యభిచార గుట్టును సైబర్ క్రైమ్ టూ టౌన్ పోలీసులు రట్టు చేశారు. నగర కమిషనర్ ఆదేశాలతో నిఘా పెట్టిన పోలీసులు.. ఏజెంట్ల సాయంతో వ్యభిచారం నిర్వహిస్తున్న రావాడ కామరాజుతో పాటు రమేశ్, సుభద్ర, సూర్యవంశీ, రాములను అరెస్టు చేశారు. 34 మంది ఏజెంట్ల డేటాను భద్రపరిచి అనాధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.