News March 7, 2025

విశాఖ: గీత కార్మికులకు 14 మద్యం దుకాణాలు కేటాయింపు

image

విశాఖలో గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలకు గురువారం లాటరీ నిర్వహించారు. ఉడా చిల్డ్రన్ ఏరినాలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో ఈ లాటరీ నిర్వహించారు. ఇందులో 14 మందికి మద్యం దుకాణాలను కేటాయించారు. వారిలో జీవీఎంసీ లిమిట్స్‌లో 11 మందికి, భీమిలి పరిధిలో ఒకరికి, పద్మనాభం పరిధిలో ఒకరికి, ఆనందపురం పరిధిలో ఒకరికి కేటాయించారు. జిల్లాలో 14 మద్యం దుకాణాలకు గాను 316 దరఖాస్తులు వచ్చాయి.

Similar News

News March 9, 2025

అమెరికా నుంచి వచ్చి.. విశాఖలో మృతి

image

అమెరికాలో స్థిరపడ్డ రోజా అనే వివాహిత విశాఖలో విగతజీవిగా మారింది. అమెరికాలో వైద్యునిగా పనిచేస్తున్న విశాఖకు చెందిన శ్రీధర్‌కు రోజాతో పరిచయం ఏర్పడింది. శ్రీధర్ నెల రోజుల క్రితం విశాఖ రాగా.. నాలుగు రోజుల క్రితం రోజా కూడా చేరుకుంది. వీరిద్దరూ హోటల్లో ఉండగా ఆమె మృతి చెందినట్లు త్రీటౌన్ పోలీసులకు శ్రీధర్ ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News March 9, 2025

విశాఖలో 142 కేసులు పరిష్కారం

image

విశాఖ జిల్లా కోర్ట్‌లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా 142 కేసులు పరిష్కారం చేసి బాధితులకు రూ.11.76 కోట్ల నష్ట పరిహారం చెల్లించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అలపాటి గిరిధర్ పేర్కొన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యమన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి.శేషమ్మ, మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి వెంకటరమణ ఉన్నారు.

News March 9, 2025

స్టీల్ ప్లాంట్‌లో 900 మంది కార్మికులు తొలగింపు

image

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసులు ఇచ్చారు. అయితే మరో పక్కన స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్‌కు యాజమాన్యం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

error: Content is protected !!