News January 1, 2025

విశాఖ: ‘గుడ్లు కూడా క్యాచ్ అంటూ విసిరేవాడు’

image

విశాఖ కుర్రాడు నితీశ్ సెంచరీ చేయడంపై అతని చిన్నప్పటి కోచ్ కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు. నితీశ్‌కు 8 ఏళ్లు ఉన్నప్పుడు అతని తండ్రి ముత్యాల నాయుడు తన దగ్గరకు తీసుకొచ్చాడని చెప్పారు. ఇంట్లో చాలా అల్లరి చేస్తున్నాడు.. చివరికి కోడి గుడ్లు కూడా క్యాచ్ అంటూ విసురుతున్నాడు కోచింగ్ ఇవ్వండి అన్నారని తెలిపారు. నితీశ్ ఆట చూసి అప్పుడే తన ఆటోగ్రాఫ్‌ను బ్యాట్ పై తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 22, 2025

విశాఖలో రూ.7,62,892 విలువ గల బాణసంచా సీజ్

image

విశాఖలో దీపావళి వేడుకల్లో 3 సంవత్సరాల కంటే చాలా తక్కవ వాయుకాలుష్యం నమోదు అయ్యింది. సీపీ ఆదేశాలతో పోలీసులు దాడులు జరిపి 39 కేసులు నమోదు చేసి, రూ.7,62,892 విలువ గల నకిలీ మందుగుండు సామగ్రి, లైసెన్స్ లేని బాణసంచా సామగ్రి సీజ్ చేశారు. ఈ సంవత్సరం దీపావళి తర్వాత, 3 మూడు సంవత్సరాల కంటే తక్కువగా నగరంలో వాయుకాలుష్యం నమోదు అయిందని విశాఖ పోలీసులు బుధవారం తెలిపారు.

News October 22, 2025

విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా సహాయకుల అరెస్ట్

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇది వరకే క్రికెట్ బెట్టింగ్ కేసులో ముద్దాయిలను దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మరో నలుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. ‘exchange 666’ అనే బెట్టింగ్ యాప్‌తో బెట్టింగ్ చేస్తున్న రాంబిల్లికి చెందిన బంగార్రాజు, అచ్యుతాపురానికి చెందిన కొరుప్రోలు పూర్ణ కిశోర్, పరవాడకు చెందిన మేడిశెట్టి రాజు, విజయనగరానికి చెందిన గడిదేశి ఈశ్వరరావును అరెస్ట్ చేశారు.

News October 22, 2025

విద్యుత్ కనెక్షన్ల జారీ సరళతరం: CMD పృథ్వీతేజ్

image

కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియను సరళతరం చేశామని APEPDCL CMD పృథ్వీతేజ్ తెలిపారు. ‌ఇకపై వినియోగదారులు ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్, ఎస్టిమేట్ తయారీ అవసరం లేదన్నారు. 150 కిలోవాట్ వరకు ఫిక్స్‌డ్ కనెక్షన్ ఛార్జీలు ఉంటాయన్నారు. దరఖాస్తు సమయంలోనే వినియోగదారుడికి చెల్లించాల్సిన మొత్తం స్పష్టంగా తెలుస్తుందని దీంతో కనెక్షన్ జారీ వేగవంతమవుతుందన్నారు.