News February 26, 2026

విశాఖ: గురుకుల ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పు

image

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్ష మార్చి1న ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు జరగనుంది. అయితే 6 నుంచి 10 తరగతుల మిగిలిన సీట్ల భర్తీకి మార్చి 2న జరగాల్సిన పరీక్షను మార్చి 8కి వాయిదా వేసినట్లు సబ్బవరం ప్రిన్సిపల్ కేశవరావు, సమన్వయకర్త జి. గ్రేస్ తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాన్నారు.

Similar News

News April 16, 2026

NZB: పాలకమండలి సభ్యుడిగా చెరుకూరి రజనీకాంత్

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడిగా కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ చెరుకూరి రజినీకాంత్ నియామకమయ్యారు. విద్యా విభాగంలో ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయన పేద విద్యార్థులకు, సామాజిక సేవా కార్యక్రమాల్లో సేవలందిస్తారు. ఆయన నియామకం పట్ల TU పూర్వ విద్యార్థి సంఘం నాయకులు ప్రదీప్, డా.శ్రీనివాస్ గౌడ్, చరణ్, డా.రాహుల్ హర్షం వ్యక్తం చేస్తూ వర్సిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.

News April 16, 2026

ముంబై స్కోర్ ఎంతంటే?

image

IPL: పంజాబ్‌తో మ్యాచులో ముంబై 20 ఓవర్లలో 195/6 రన్స్ చేసింది. ఓపెనర్ డికాక్ సెంచరీతో అదుర్స్ అనిపించారు. 60 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 112* రన్స్ చేశారు. నమన్ ధీర్ (31 బంతుల్లో 50) రాణించారు. రికెల్టన్ (2), సూర్య (0), పాండ్య (14), రూథర్‌ఫోర్డ్ (1) నిరాశపరిచారు. అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశారు.

News April 16, 2026

NLG: లక్ష్యం దిశగా రబీ కొనుగోళ్లు..

image

NLG జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 5,512 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఇప్పటివరకు జరిగిన మొత్తం కొనుగోళ్లు 36,360 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. సేకరించిన ధాన్యంలో 36,298 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 62 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉంది. ఈ కొనుగోళ్ల ద్వారా ఇప్పటివరకు 4,112 మంది రైతులు లబ్ధి పొందారు.