News February 26, 2026
విశాఖ: గురుకుల ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పు

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్ష మార్చి1న ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు జరగనుంది. అయితే 6 నుంచి 10 తరగతుల మిగిలిన సీట్ల భర్తీకి మార్చి 2న జరగాల్సిన పరీక్షను మార్చి 8కి వాయిదా వేసినట్లు సబ్బవరం ప్రిన్సిపల్ కేశవరావు, సమన్వయకర్త జి. గ్రేస్ తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాన్నారు.
Similar News
News April 12, 2026
NTR: బి.ఫార్మసీ విద్యార్థులకు అలర్ట్

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో FEB 2026లో నిర్వహించిన బి.ఫార్మసీ 3వ సెమిస్టర్ పరీక్షల (2025-26 విద్యా సంవత్సరం) రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 20లోపు ఒక్కో పేపరుకు రూ. 1,000 ఫీజు http://www.onlinesbi.com/ వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుందని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
News April 12, 2026
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక వేదిక

పార్వతీపురం కలెక్టరేట్‌లో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం కల్పించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్జీలు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
News April 12, 2026
ప్రకాశం: కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డ తండ్రి

ప్రకాశం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తాళ్లూరు(M)లో తండ్రి తన 13 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే 2, 3 రోజుల నుంచి బాలికకు కడుపు నొప్పి వస్తుండటంతో ఒంగోలు రిమ్స్ కు తరలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లూరు PS హెడ్ కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


