News April 6, 2024

విశాఖ: గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

image

విశాఖ రైల్వే స్టేషన్ నాలుగో నంబర్ ప్లాట్ ఫామ్‌పై ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు రైల్వే ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. మృతుని వయసు 50-55 ఏళ్లు ఉంటుందని తెలిపారు. నీలం రంగు టీ షర్ట్, బ్రౌన్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Similar News

News February 16, 2026

అంతర్జాతీయ కార్యక్రమాల భద్రతపై సీపీ సమీక్ష

image

విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల భద్రతా ఏర్పాట్లపై సీపీ డా.శంఖబ్రత బాగ్చి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. విదేశీ ప్రతినిధులు, VVIPల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై కీలక ఆదేశాలిచ్చారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, డ్రోన్ నిఘా, CCTV మానిటరింగ్‌తో పాటు చిన్నారుల రక్షణకు RFID సాంకేతికతను వినియోగించాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.

News February 16, 2026

విశాఖలో గవర్నర్‌కు ఘన స్వాగతం

image

విశాఖలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీసు కమిషనర్ సంఖ బ్రత బాగ్జీ, నౌకాదళ అధికారులు ఘన స్వాగతం పలికారు.

News February 16, 2026

విశాఖలో శాప్ లీగ్ క్రీడా పోటీల పోస్టర్ విడుదల

image

విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం ‘శాప్ లీగ్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ లీగ్‌లో భాగంగా ఈనెల 17న గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి చదరంగం (Chess) పోటీలు, 24న మర్రిపాలెంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.