News April 2, 2024
విశాఖ: గోవులతో ఉన్న కంటైనర్ సీజ్

నక్కపల్లి మండలం వేంపాడు హైవే టోల్ ప్లాజా వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ సమీపంలో కబేళాకు గోవులను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు డీఎస్పీ మోహన్, నక్కపల్లి సీఐ విజయ్ కుమార్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. దీంతో ఒక కంటైనర్ తనిఖీ చేయగా.. అందులో 65 గోవులున్నట్టు గుర్తించారు. ఈ మేరకు కంటైనర్ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
Similar News
News October 18, 2025
ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అంటారేమో: విష్ణుకుమార్ రాజు

వైసీపీ స్థితిని చూస్తే బాధ కలుగుతోందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రెండు ఆటోలు గుద్దుకున్నా ఛలో పోలీస్ స్టేషన్ అనే స్థాయికి దిగిపోయిందని ఎద్దేవా చేశారు. వైజాగ్ ఐటీ, ఐటీ అనుబంధ రంగాలకు బెస్ట్ డెస్టినేషన్ అవుతుందన్నారు. అదానీకి భూములు ధారాదత్తం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా 2వేల ఉద్యోగాలు, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతారని వెల్లడించారు.
News October 18, 2025
గాజువాక: టిప్పర్ బీభత్సం.. మహిళ మృతి

గాజువాక సమతా నగర్లో దారుణం చోటుచేసుకుంది. శనివారం ఉదయం భారీ టిప్పర్ రోడ్డు పక్కన కొబ్బరిబోండాలు అమ్ముతున్న వియ్యపు అప్పయ్యమ్మపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న బాలుడికి గాయాలు అయ్యాయి. న్యూపోర్ట్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నిద్రమత్తులో వాహనం నడపడం వలనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
News October 17, 2025
విశాఖ డీఆర్వో Vs ఆర్డీవో

విశాఖ DRO భవానీ శంకర్, RDO శ్రీలేఖ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. డీఆర్వోపై కలెక్టర్కు ఆర్డీవో ఇటీవల లేఖ రాయగా.. రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందించినట్లు సమాచారం. పచారీ సరుకుల కోసం తహశీల్దార్లకు ఇండెంట్లు పెడుతున్నారన్న RDOఆరోపణలపై ‘అవగాహన లేని అధికారి చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని’ DRO అన్నారు. కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.