News December 10, 2024
విశాఖ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

విశాఖలోని స్కానింగ్ సెంటర్లో మహిళను సిబ్బంది వేధింపులకు గురిచేసిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. <<14841020>>మహిళపై అసభ్యంగా <<>>ప్రవర్తించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News December 7, 2025
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు 279 మంది హాజరు

విశాఖలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష ఆదివారం జరిగింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 349 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 279 మంది హాజరయ్యారని డైరెక్టర్ కె.రాజేశ్వరి తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు. ఎంపికైన వారికి సివిల్స్ పరీక్షకు శిక్షణ ఇస్తామన్నారు.
News December 7, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. GVMC ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్ కార్యలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.