News December 10, 2024

విశాఖ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

image

విశాఖలోని స్కానింగ్ సెంటర్లో మహిళను సిబ్బంది వేధింపులకు గురిచేసిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. <<14841020>>మహిళపై అసభ్యంగా <<>>ప్రవర్తించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News January 25, 2025

విశాఖ: పురుగు మందు తాగి తల్లీ కూతురు మృతి

image

తగరపువలస ఆదర్శనగర్లో ‌విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. భార్యాభర్తల గొడవతో మనస్తాపం చెందిన వివాహిత శనివారం మాధవి (25)ఇద్దరు కుమార్తెలతో పాటు పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తల్లితో పాటు చిన్న కుమార్తె రతిక్ష మృతి చెందింది. మృతిరాలి భర్త రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంమని పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News January 25, 2025

భీమిలి: ‘విజ‌య‌సాయి రెడ్డి చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరు’

image

విజ‌య‌సాయి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వెళ్లినా చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు అన్నారు. శనివారం ఆయన తన నివాసాల విలేకరులతో మాట్లాడారు. విజయసాయి హ‌యాంలో విశాఖ‌ వాసులు ప‌డిన ఇబ్బందుల‌ను మ‌ర్చిపోలేమ‌న్నారు. వైసీపీ మునిగిపోయే నావని తాను ఎప్పుడో చెప్పాన‌ని వ్యాఖ్యని గుర్తుచేస్తూ ఇప్పుడు అది నిజమవుతోందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై ఇప్పటికీ వక్రంగా మాట్లాడుతున్నారన్నారు.

News January 25, 2025

భీమిలి: కుమార్తె వీడియోలు చూపించి తల్లిని బ్లాక్ మెయిల్

image

భీమిలిలో ఫొక్సో కేసు నమోదైనట్లు సమాచారం. గాజువాకకు చెందిన వ్యక్తి భీమిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆ వీడియోతో బాలిక తల్లిని బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.