News April 9, 2024

విశాఖ: ఘనంగా పెళ్లి రాట మహోత్సవం

image

విశాఖ బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత ఆలయం అయిన అంబికా బాగ్‌లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సీతారాముల కళ్యాణానికి సంబంధించి పెళ్లి రాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈనెల 17వ తేదీన నిర్వహించే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రుని పెండ్లి కొడుకును చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి తిరుమలేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News April 11, 2025

విశాఖ జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం నుంచి విశాఖ నగరంలో వాతావరణ మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

News April 10, 2025

విశాఖ: మే 10న జాతీయ లోక్ అదాలత్

image

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 10న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గురువారం తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినయోగించుకోవాలన్నారు.

News April 10, 2025

భీమిలి మార్కెటింగ్ మాజీ ఛైర్మన్ ఆత్మహత్య

image

విశాఖలో టీడీపీ నాయకుడు కోరాడ నాగభూషణం గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిలి మార్కెటింగ్ మాజీ ఛైర్మన్ కోరాడ నాగభూషణం ఆరిలోవ హెల్త్ సిటీలోని ఓ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం చేరారు. ఈ రోజు ఉదయం ఆస్పత్రి 4వ అంతస్తు నుంచి దూకి చనిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.  

error: Content is protected !!