News July 30, 2024
విశాఖ: ‘చట్టబద్ధమైన దత్తతను మాత్రమే ప్రోత్సాహించాలి’

చట్టబద్ధమైన దత్తతను మాత్రమే ప్రోత్సాహించాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కే.అప్పారావు సూచించారు. ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, కేజీహెచ్ సంయుక్తంగా మంగళవారం కేజీహెచ్ ఎథిక్స్ గ్యాలరీలో అనాధికార దత్తత-చట్టప్రకారం చర్యలు అనే అంశంపై గైనకాలజీ పిల్లల విభాగం వైద్యులు, నర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు గొండు సీతారాం పాల్గొన్నారు.
Similar News
News October 25, 2025
మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ వద్ద మృతదేహం కలకలం

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. రిజర్వాయర్ చేసే గేటు వద్ద తేలుతూ కనిపించిన మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News October 25, 2025
విశాఖలో సీఐల బదిలీ: సీపీ

విశాఖలో 8మంది CIలను బదిలీ చేస్తూ CP శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. 1టౌన్ సీఐ జీడి బాబును ఎయిర్ పోర్టు ప్రోటోకాల్‌కు, సీసీఎస్‌లో ఉన్న సీఐ శంకర్‌నారాయణను ఎయిర్ పోర్టు స్టేషన్‌కు, అక్కడ పనిచేస్తున్న ఉమామహేశ్వరరావును సిటీ వీఆర్‌కు, రేంజ్‌లో ఉన్న వరప్రసాద్‌ను వన్‌టౌన్ స్టేషన్‌కు, సీపోర్టు ఇమిగ్రేషన్‌లో ఉన్న శ్రీనివాసరావును వీఆర్‌కు, సిటీ వీఆర్‌లో ఉన్న రామకృష్ణ స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు.
News October 25, 2025
నాగుల చవితి సందర్భంగా VMRDA పార్కుల్లో ఉచిత ప్రవేశం

నాగుల చవితి పండగ సందర్భంగా నగరవాసుల సౌకర్యార్థం శనివారం VMRDA పరిధిలోని అన్ని పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ ప్రకటించారు. నాగుల చవితి పురస్కరించుకుని ప్రజలు పుట్టల్లో పాలు పోసేందుకు కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో వస్తారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బీచ్ రోడ్ పార్క్, సెంట్రల్ పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్‌లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.


