News January 29, 2025

విశాఖ: చిట్టీల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

image

విశాఖ టూటౌన్ పోలీసులు చిట్టీల పేరుతో మోసం చేసి పరారైన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రవీణ్ కుమార్ గతంలో విశాఖ పోలీస్ కమిషనర్ ఎదురుగా జ్యూస్ షాప్ నిర్వహించేవాడు. ఆ సమయంలో పోలీసులతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం కానిస్టేబుల్స్, స్థానికుల నుంచి చిట్టీలు కట్టించుకునేవాడు. రెండేళ్ల క్రితం రూ.80 లక్షలతో పరారీ కాగా బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News February 18, 2025

బ‌హుళ పంట‌ల విధానంపై రైతుల్లో చైత‌న్యం తీసుకురావాలి: కలెక్టర్

image

లాభ‌దాయ‌క సాగు విధానాల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని వ్య‌వ‌సాయ అనుబంధ శాఖ‌ల‌ అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్ర‌కృతి సేద్యానికి, మిల్లెట్లు, బ‌హుళ పంట‌ల సాగుకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. గ్రామాలల్లో ప్ర‌తి ఇంటి వ‌ద్దా కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంప‌కం చేసేలా అవ‌గాహ‌న కల్పించాలన్నారు.

News February 18, 2025

గాజువాక: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

గాజువాక షీలా నగర్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైలపల్లి మనోహర్ బైక్‌ను నడుపుతుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతని తండ్రి పేరు దేముడు అని ఐడి కార్డులో రాసి ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

విశాఖలో చదివిన ఏయూ వైస్-చాన్సలర్‌ రాజశేఖర్

image

ఏయూ వైస్-చాన్సలర్‌‌గా మంగళవారం నియామకం అయిన రాజశేఖర్ విశాఖలో విద్యాభ్యాసం చేశారు. విశాఖలో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్‌లో పదోతరగతి పూర్తి చేశారు. ఏ.వి.ఎన్. కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయనను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. అయితే విశాఖతో అనుబంధం ఉన్న వ్యక్తిని వైస్ ఛాన్సలర్‌గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!