News November 27, 2024

విశాఖ: చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్స్..

image

చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్స్‌కు పోక్సో కోర్టు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఆనందపురం మం. ఓ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్న సుందరరావు, వెంకటేశ్వరరావు 2019 ఆగస్టులో విద్యార్థినులతో వీడియోలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై తోటి టీచర్‌లు MEOకి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా నేరం రుజువైంది. దీంతో జడ్జి ఆనందిని వీరికి ఏడాది జైలు శిక్ష విధించారు.

Similar News

News December 14, 2024

భీమిలి: అల్లు అర్జున్ నివాసంలో కలిసిన గురు శిష్యులు

image

అల్లు అర్జున్ బెయిల్ పై విడుదల అయిన సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భీమిలి ఎమ్మెల్యే గంటా, మాజీ ఎమ్మెల్యే అవంతి కలిశారు. గురు శిష్యులుగా ముద్ర వేసుకున్న వారు చిరు నవ్వులు చిందిస్తూ ముచ్చటించుకున్నారు. ఇరువురి కలయికపై భీమిలిలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీకి రాజీనామా చేసిన అవంతి తిరిగి టీడీపీలో చేరతారని చర్చ నడుస్తోంది.

News December 14, 2024

విశాఖ: 18 ఏళ్లు నిండని బాలుడిపై 11 కేసులు

image

విశాఖలోని కంచరపాలెంకు చెందిన బాల నేరస్థుడిని శుక్రవారం 3వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18 ఏళ్లు కూడా నిండని బాలుడిపై 11 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నేరస్థుడిపై చోరీ కేసులు నమోదు కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో నిందితుడిని మద్దిలపాలెంలో అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.

News December 13, 2024

పెందుర్తి: మెగా, అల్లు ఫ్యామిలీలు ఒక్కటే: బొలిశెట్టి

image

అల్లు అర్జున్‌ అరెస్ట్ వ్యవహారంపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ‘X’ ద్వారా స్పందించారు. ‘హైకోర్టు తీర్పు రాకముందే అల్లు అర్జున్‌ను జైలుకు తరలించాలన్నది పోలీసుల అత్యుత్సాహంగా కనిపిస్తోంది. సంధ్య థియేటర్‌కు హీరో వస్తున్న విషయం మీడియాలో 2రోజుల ముందే వచ్చింది. CP తెలియదనడం హాస్యాస్పదం. మెగా, అల్లు ఫ్యామిలీలు రెండు కాదు ఒక్కటే.. ఈ తప్పుడు కేసు వల్ల అనేక నోర్లు మూతపడతాయి’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.