News March 19, 2025
విశాఖ: చిన్న శ్రీను కుమారుడి మృతి

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ నేడు మృతి చెందాడు. 2020లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.
Similar News
News March 19, 2025
స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలి: కలెక్టర్

ఏప్రిల్ 30న సింహాచలంలో జరిగే చందనోత్సవంకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్యూలైన్లలో విరివిగా తాగునీటి కేంద్రాలను, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈఓను ఆదేశించారు.
News March 19, 2025
విశాఖలో ఈనెల 24, 30న ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ

విశాఖలో మార్చి 24,30 తేదీలలో జరిగే IPL మ్యాచ్‌ల నిర్వహణపై CP శంఖబ్రత బాగ్చీ బుధవారం సమీక్షించారు. మ్యాచ్ జరిగే రోజుల్లో విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని CP తెలిపారు. మ్యాచ్ రోజు శ్రీకాకుళం, VZM వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఆనందపురం, పెందుర్తి, NAD మీదుగా నగరంలోకి రావాలన్నారు. చిన్న వాహనాలు మారికవలస(లేదా) మిథులాపురి కాలనీ, బీచ్ రోడ్డు, జోడిగుడ్లపాలెం మీదుగా నగరంలోకి వెళ్ళాలని సూచించారు. >Share it
News March 19, 2025
ఎగుమతుల పెంపునకు కృషి: మంత్రి కొండపల్లి

విశాఖలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ సాధికారత సదస్సులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. MSME రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. MSMEలు రాష్ట్రంలో ఉపాధి పెంపుదల,ఆర్థిక వృద్ధికి మూలస్తంభాలన్నారు. కేంద్ర ప్రభుత్వ Viksit Bharat 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన వ్యూహాలను రూపొందిస్తున్నామన్నారు.