News December 4, 2024
విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ చెన్నై ఎగ్మోర్ స్పెషల్ ట్రైన్ ఈనెల 7 నుంచి వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ వరకు ప్రతి శనివారం నడుపుతున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖకు ఈనెల 8 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు.
Similar News
News February 8, 2026
విశాఖ: వేసవికి వాటర్ టెన్షన్ లేనట్లేనా..!

విశాఖకి వచ్చే వేసవిలో నీటి కొరత ఉండదని GVMC అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నగరానికి తాగునీరు అందించే ఏలేరు, రైవాడ, మేఘాద్రి గెడ్డ, తాటిపూడి, గోస్తనీ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలతో కనీసం 6 నెలల పాటు నిరంతర నీటి సరఫరా చేయగలమన్నారు. వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంపై పర్యవేక్షణ కొనసాగుతోందని GVMC నీటి సరఫరా అధికారి పల్లంరాజు స్పష్టం చేశారు.
News February 8, 2026
అవంతి శ్రీనివాస్ మళ్లీ వైసీపీ గూటికే చేరనున్నారా?

విశాఖ జిల్లాలో YCP మాజీ నేతల రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మళ్లీ ‘ఫ్యాన్’ నీడకే చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీఎంపీ MVV.సత్యనారాయణ యాక్టివ్ కానున్నట్లు సమాచారం. గౌరవం, గుర్తింపు దక్కే చోటకే వెళ్లాలని వీరు భావిస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ నేతల పునరాగమనం జిల్లా రాజకీయాల్లో కీలకం కానుంది.
News February 8, 2026
విశాఖలో కేజీ చికెన్ రూ.244

విశాఖలో చికెన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.137, విత్ స్కిన్ కేజీ రూ.244, స్కిన్ లెస్ కేజీ రూ.254 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా శోంఠాం కోడి కేజీ రూ.300 పలకగా.. డజన్ గుడ్లు రూ.65కి అమ్ముతున్నారు. మటన్ కేజీ రూ.1000 కాగా.. చేపలు అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎంవీపీ కాలనీ, అప్పుఘర్, ఫిషింగ్ హర్బర్ సముద్రపు చేపల అమ్మకాలతో సందడిగా ఉన్నాయి.


