News August 9, 2024
విశాఖ చేరుకున్న భారత నౌకాదళ అధిపతి

భారత నౌకాదళ అధిపతి విశాఖ తూర్పు నౌకాదళానికి చేరుకున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. తూర్పు నౌకాదళం పరిధిలో కొనసాగుతున్న వివిధ నేవల్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న ఆయనకు తూర్పు నౌకాదళం అధిపతి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్ స్వాగతం పలికారు. పరేడ్ మైదానంలో నౌకాదళ సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
Similar News
News October 24, 2025
ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన విశాఖ కలెక్టర్

చినగదిలిలో ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం గోదాములను సందర్శించిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అక్కడ అధికారులకు, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News October 24, 2025
‘ది డెక్’ భవనంలో జార్జియా యూనివర్సిటీ అద్దె ఒప్పందం రద్దు

సిరిపురంలోని ‘ది డెక్’ భవనంలో జార్జియా యూనివర్సిటీ అద్దె ఒప్పందాన్ని వీఎంఆర్డీఏ రద్దు చేసింది. నిర్దిష్ట సమయంలో డిపాజిట్ చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందం కుదిరిన 15 రోజుల్లోపు అడ్వాన్స్ డిపాజిట్ చెల్లించాలి. మూడు నెలలు గడిచినా డిపాజిట్ చెల్లించకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో మూడో ఫ్లోర్ ఖాళీగా ఉంది. దీనికోసం మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
News October 24, 2025
‘కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు భర్తీ కావాలి’

కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సూపరింటెండెంట్ ఐ.వాణిని గురువారం కోరారు. 34 హెడ్ నర్సులు, 43 కాంట్రాక్ట్ నర్సులు, ట్రామా కేర్‌లో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. సిబ్బంది పనిభారం అధికమై రోగుల సేవలో నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.


