News March 26, 2024
విశాఖ: జనారణ్యంలోకి కణుజు

విశాఖ బీచ్ రోడ్డులోని గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల ప్రాంతంలో ఓ కణుజు సోమవారం సంచరించింది. చెంగు చెంగున గంతులేస్తూ కొంత సమయం పాటు రహదారిపై అటూ ఇటూ తిరిగి సమీప జూపార్కు జాజాల గుమ్ము వైపు ముళ్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రయాణికులు ఆసక్తిగా ఈ దృశ్యాన్ని వీక్షించారు. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఇలాంటి మూగ జీవాలు గత కొంతకాలంగా తరచూ బయటకొచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి.
Similar News
News October 17, 2025
విశాఖ: చోరీ కేసులో అక్కాచెల్లెలు అరెస్ట్

చోరీ కేసులో అక్కాచెల్లెలును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్‌నగర్‌లో ఉంటున్న నరసింహరావు ఇంట్లో అనకాపల్లి జిల్లా సోమలింగాపురానికి చెందిన నాగమణి పనిచేస్తోంది. ఈనెల ఒకటో తేదీన బీరువాలో చెవి దిద్దులు, పచ్చలహారం నాగమణి దొంగతనం చేసి తన చెల్లెలు మంగకు ఇచ్చింది. గమనించిన ఇంటి యజమాని నరసింగరావు దువ్వాడ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News October 17, 2025
విశాఖ: అక్టోబర్ 18న స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు

అక్టోబర్ 18న మూడవ శనివారం “CLEAN AIR” అనే కాన్సెప్ట్‌పై స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి క్లీన్ ఎయిర్ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఆరోజున శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
News October 16, 2025
విశాఖ పోలీసుల ఫైన్లపై మీరేమంటారు..!

విశాఖలో గత 15నెలల్లోనే పోలీసులు 8.54 లక్షల ఈ-చలాన్‌లు జారీ చేసి రూ.46.4కోట్ల ఫైన్ విధించారు. ఇప్పటి వరకు రూ.13.39కోట్లు రాబట్టారు. నగరంలో 12 లక్షల వాహనాలు ఉండగా.. కొందరు సిగ్నల్ జంప్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రతి 2రోజులకు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు.మరోవైపు షాపులు, రైతుబజార్ల వద్ద పార్క్ చేసిన వాహనాలకూ ఫైన్లు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.