News March 26, 2024
విశాఖ: జనారణ్యంలోకి కణుజు

విశాఖ బీచ్ రోడ్డులోని గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల ప్రాంతంలో ఓ కణుజు సోమవారం సంచరించింది. చెంగు చెంగున గంతులేస్తూ కొంత సమయం పాటు రహదారిపై అటూ ఇటూ తిరిగి సమీప జూపార్కు జాజాల గుమ్ము వైపు ముళ్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రయాణికులు ఆసక్తిగా ఈ దృశ్యాన్ని వీక్షించారు. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఇలాంటి మూగ జీవాలు గత కొంతకాలంగా తరచూ బయటకొచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి.
Similar News
News July 6, 2025
విశాఖలో భక్తి శ్రద్ధలతో మొహరం

విశాఖలో మొహరం వేడుకలకు ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చెంగలరావుపేటలోని హుసేని మసీదు ఆధ్వర్యంలో షియా ముస్లింలు హజరత్ ఇమామ్ హుస్సేన్ మరణానికి సానుభూతిగా రక్తం చిందించారు. ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
News July 6, 2025
గిరి ప్రదక్షిణ: పార్కింగ్ ప్రదేశాలివే-2

➣అడవివరం నుంచి గిరిప్రదక్షిణ నిమిత్తం తొలిపావంచకు వచ్చే వారు వాహనాలను అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పెట్టి కాలినడకన రావి చెట్టు జంక్షన్ నుంచి గాంధీనగర్, కోనేరు మీదుగా కలశం జంక్షన్ చేరుకోవాలి
➣ వేపగుంట, గోపాలపట్నం నుంచి వచ్చే భక్తులు సింహపురి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలైన RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో వాహనాలు నిలపాలి.
News July 6, 2025
విశాఖలో రేపు P.G.R.S.

విశాఖలో కలెక్టరేట్, జీవీఎంసీ, సీపీ ఆఫీసుల్లో సోమవారం P.G.R.S. నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉదయం 9.30కు P.G.R.S. ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. జీవీఎంసీ ఆఫీసులో మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు స్వీకరించనున్నారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులో సీపీ ప్రజల నుంచి వినతులు అందుకోనున్నారు. కాల్ సెంటర్ 1100ను సంప్రదించి కూడా ప్రజలు వినతులను నమోదు చేసుకోవచ్చు.