News January 29, 2025
విశాఖ జిల్లాకు రిపోర్టర్లు కావలెను

విశాఖ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ<
Similar News
News November 13, 2025
4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యచర్ ఎనర్జీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో అనంతపురం, కడప, కర్నూలులో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ గురువారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి ఈడీబీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.
News November 13, 2025
జోడుగుళ్లపాలెం సముద్ర తీరంలో మృతదేహం

ఆరిలోవ స్టేషన్ పరిధి జోడుగుళ్లపాలెం బీచ్కు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం ఉదయం కొట్టుకొచ్చిందని పోలీసులు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని.. రెండు చేతుల మీద పచ్చబొట్లు ఉన్నాయని చెప్పారు. మృతుడిని ఎవరైనా గుర్తుపడితే ఆరిలోవ పోలీసులకు తెలియజేయాలని సీఐ మల్లేశ్వరరావు కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించామన్నారు.
News November 13, 2025
పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో CM చంద్రబాబు

విశాఖలో CII సుమ్మిట్లో భాగంగా గురువారం ఇండియా-యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. CM చంద్రబాబు వేర్వేరు కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలతో సమావేశమయ్యారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం అని, ఇక్కడ మంచి వనరులు ఉన్నాయన్నారు. ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నట్లు CM పేర్కొన్నారు.


