News October 22, 2024

విశాఖ జిల్లాలోని మూడు కాలేజీల్లో నైట్ క్లాసెస్

image

10, ITI వరకే చదివి ఉద్యోగాలు చేస్తున్న వారు <<14419916>>పాలిటెక్నిక్ కోర్సు <<>>పూర్తి చేయవచ్చు. వీరికి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు క్లాస్‌లు నిర్వహిస్తారు. ఆదివారం పూర్తిగా తరగతులు ఉంటాయి. విశాఖ గవర్నమెంట్ కెమికల్ ఇన్‌స్టిట్యూట్‌లో కెమికల్ ఇంజినీరింగ్ కోర్సు, అచ్యుతాపురం ప్రశాంతి కాలేజ్‌లో సీఈ, ఎంఈ కోర్సులు, విశాఖలో బెహర శుభాకర్ కాలేజ్‌లో ECE,EEE,ME కోర్సులు అందుబాటులో ఉన్నాయి. >Share it

Similar News

News January 24, 2025

గంభీరం డ్యామ్‌లో బీటెక్ విద్యార్థి మృతి

image

ఆనందపురం మండలం గంభీరం డ్యామ్‌‌లో ఈతకు వెళ్లి విద్యార్థి మీసాల నాని(20) మృతి చెందాడు. సివిల్ ఇంజినీర్ థర్డ్ ఇయర్‌ చదువుతున్న నాని కోమ్మదిలో ఓ ప్రవేటు హాస్టల్లో ఉంటున్నాడు. మృతుడు విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటకు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఆనందపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News January 24, 2025

పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ స‌హ‌కారం: విశాఖ కలెక్టర్

image

జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా సంపూర్ణ స‌హ‌కారం అందించాల‌ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సంబంధిత‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి కమిటీ సమావేశంలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ముందుకు వ‌చ్చే వారికి అన్ని విధాలా స‌హ‌కారం అందించాల‌ని సూచించారు. భూ సేక‌ర‌ణ‌, సింగిల్ విండో క్లియ‌రెన్స్ అంశాల్లో వేగం పెంచాల‌ని ఆదేశించారు.

News January 24, 2025

ఆదివారం మాంసం దుకాణాలు బంద్‌: జీవీఎంసీ

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు మేరకు విశాఖలో మాంసం అమ్మకాలు పూర్తిగా నిషేధించినట్లు అధికారులు తెలిపారు. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ దువ్వాడ, మంగళపాలెం, నరవ ప్రాంతాల్లో దుకాణ యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ ఆదేశాలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.