News June 2, 2024

విశాఖ జిల్లాలో ఎగ్జిట్ పోల్స్‌పై మీ కామెంట్?

image

ప్రధాన పార్టీలు విశాఖ జిల్లాలో తమ పార్టీకే మెజారిటీ సీట్లు వస్తాయంటూ ఆ పార్టీలలోని ముఖ్య నాయకులు మీడియా ముఖంగా చెప్పారు. ఈ తరుణంలో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదులయ్యాయి. ఇందులో జిల్లాలో చాలా వరకు టీడీపీకే మెజారిటీ అసెంబ్లీ స్థానాలు వస్తాయని, కొన్నిచోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని పేర్కొంది. విశాఖ ఎంపీ సీటు టీడీపీ, అనకాపల్లిలో బీజేపీ, అరకులో వైసీపీ గెలుస్తాయని తెలిపాయి. మరి ఈ సర్వేలపై మీ కామెంట్?

Similar News

News September 16, 2024

జీకే.వీధి: పచ్చకామెర్లతో విద్యార్థిని మృతి.?

image

గూడెం కొత్తవీధి మండలంలో మరో విషాదం నెలకొంది. ఆర్వీ నగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని జంపారంగి.ధార అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం విశాఖ కేజీహెచ్‌లో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు టీడీపీ నేత సత్తిబాబు తెలిపారు. పచ్చకామెర్లతో బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News September 16, 2024

అరకులోయ: మళ్లీ పెరిగిన అల్లం ధరలు

image

అల్లం ధర మళ్లీ పెరిగింది. ఇటీవల మన్యంలో వర్షాలు అధికంగా పడటంతో అల్లం పంట దెబ్బతింది. దీంతో దిగుడులు తగ్గి డిమాండ్ ఏర్పడింది. జూన్, జులై నెలల్లో అల్లం ధర కేజీ రూ.150 ఉండగా ఆ తరువాత కేజీ రూ.120 నుంచి రూ.130కి తగ్గింది. ప్రస్తుతం చింతపల్లిలో కేజీ రూ.200కు విక్రయిస్తున్నారు. త్వరలో కొత్త అల్లం మార్కెట్లోకి వస్తుంది. ఇది వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది.

News September 16, 2024

విశాఖ: జిల్లాకు అదనంగా 150 నుంచి 200 రేషన్ డిపోలు

image

విశాఖ జిల్లాలో రేషన్ డిపోల సంఖ్య 150 నుంచి 200 వరకు పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రాష్ట్రం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో 642 రేషన్ డిపోల పరిధిలో 5.29 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతూ వస్తున్నా డిపోలు మాత్రం పెరగలేదు. ఈనెల 30 నుంచి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.