News April 29, 2024

విశాఖ: జిల్లాలో ఓటర్ల వివరాలు ఇలా..!

image

విశాఖ జిల్లాలో తుది ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. మే 13వ తేదీన ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు 20,12,373 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈనెల 21వ తేదీకి తుది ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీరందరికీ మే 13వ తేదీన జరిగే పోలింగ్ లో ఓటు హక్కు కల్పిస్తున్నారు. ఇక కొత్తగా ఓటర్లను నమోదు చేయడం, తొలగింపు, దిద్దుబాటుకు అవకాశం లేదు. 

Similar News

News November 22, 2025

విశాఖ: పసికందు హత్య కేసులో వీడని మిస్టరీ

image

తాటిచెట్లపాలెంలో పసికందును క్రూరంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసి కాల్వలో పడేసిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలు లభించలేదు. అంతేకాకుండా మృతురాలి తలభాగం కూడా ఇప్పటిదాకా లభ్యం కాలేదు. కొండపై ఎవరైనా అనుమానితులు సంచరిస్తున్నార అన్న అనుమానంతో డ్రోన్లతో నిఘా పెట్టారు. ఆరోజు రాత్రి నుంచి వేకువజాము వరకు ఆ రోడ్డులో ప్రయాణించిన వారిని విచారిస్తున్నారు.

News November 22, 2025

వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా

image

బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.