News April 11, 2025
విశాఖ జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం నుంచి విశాఖ నగరంలో వాతావరణ మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
Similar News
News April 19, 2026
చందనోత్సవం స్పెషల్.. సింహాచలం మీదుగా ప్రత్యేక రైలు

సింహాచలం అప్పన్న చందనోత్సవ భక్తుల రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 20న విశాఖ – భువనేశ్వర్ మధ్య ప్రత్యేక జనసాధారణ్ రైలు (08512) నడవనుంది. ఈ రైలు ఉదయం 10.30 గంటలకు విశాఖలో బయలుదేరి 10.48 గంటలకు సింహాచలం చేరుకుంటుంది. నిమిషం విరామం తర్వాత 10.49 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.
News April 19, 2026
ఆర్కేబీచ్ రోడ్డులో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

ఆర్కేబీచ్ రోడ్డులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఫిషింగ్ హార్బర్ వైపు వెళ్తున్న బైకర్ డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2026
విశాఖ – భవానీపట్న రైలు రీషెడ్యూల్

ఇన్‌కమింగ్ రేక్ ఆలస్యం కావడంతో విశాఖ – భవానీపట్న ప్యాసింజర్ (58504) రైలు సమయాన్ని మార్చినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.


