News June 20, 2024
విశాఖ జిల్లాలో విషాదం.. బకెట్లో పడి బాలుడు మృతి
ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ గారిపేటకు చెందిన మోక్షిత్ అనే చిన్నారి బాత్రూంలో బకెట్లో పడి మృతి చెందాడు. మంగళవారం రాత్రి భోజనాల చేసే సమయంలో మోక్షిత్ కనబడకపోవడంతో తల్లిదండ్రులు పరిసరాలలో వెతకగా.. బాత్రూంలోని బకెట్లో అపస్మారకస్థితిలో ఉన్నాడు. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా బుధవారం చికిత్స పొందుతూ మరణించాడు. కేసును సీఐ ఆధ్వర్యంలో ఏఎస్సై పైడిరాజు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 8, 2024
విశాఖ: తీవ్రవాయుగుండంగా మారనుందా?
కళింగపట్నానికి తూర్పున 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణశాఖ అధికారుల తెలిపారు. పూరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల సమీపానికి చేరిన వాయుగుండం చేరిందన్నారు. ఇది దాదాపు వాయవ్యంగానే పయనిస్తూ రేపు ఉదయానికి తీవ్రవాయుగుండంగా మారుతుందని అంచనా వేశారు. వేగంగా పయనిస్తున్నందున రేపు మధ్యాహ్నానికే పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.
News September 8, 2024
ఏయూ అనుబంధ కళాశాలలకు రేపు సెలవు
ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఈ.ఎన్. ధనుంజయరావు తెలిపారు. రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మరల ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సెలవు ప్రకటించినట్లు ఆయన తెలియజేశారు.
News September 8, 2024
విశాఖ: ‘ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య’
ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎన్.ఎన్ రాజు అన్నారు. ఈనెల 12న ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పీఏపీ కార్యదర్శి కామేశ్వరరావు అధ్యక్షతన ఆత్మహత్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆత్మహత్యకు పాల్పడే గుర్తించే అవకాశం యువతకు, కుటుంబ సభ్యులకు ఉంటుందని వెంటనే వారిని కాపాడాలని కోరారు.