News April 3, 2024
విశాఖ జిల్లాలో 48% పింఛన్ల పంపిణీ

విశాఖ జిల్లాలో బుధవారం సాయంత్రం ఏడు గంటల వరకు 48% సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. అత్యధికంగా పెందుర్తి మండలంలో 76% పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైనట్లు తెలిపారు. జిల్లాలో పెన్షనర్లు మొత్తం 1,65,432 మంది కాగా 79,113 మందికి పింఛన్లు అందజేశామన్నారు.
Similar News
News February 9, 2026
తీరు మారకపోతే కఠిన చర్యలు: విశాఖ కలెక్టర్

కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన PGRSలో భాగంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడారు. 25 శాతం కంటే ఎక్కువ పెండింగ్ ఉన్న అధికారులకు మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజా వినతుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తున్న టీపీవో-6కి ఛార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ పనితీరును నెల రోజులు సూక్ష్మంగా పరిశీలిస్తానని, తీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 8, 2026
విశాఖ: కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయని, రెవెన్యూ అధికారులతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు.
News February 8, 2026
కేజీహెచ్ జీఎన్ఎం పరీక్షలో మాస్ కాపీయింగ్.. ముగ్గురు డిబార్

విశాఖ కేజీహెచ్ అనుబంధ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న సమాచారం మేరకు కౌన్సిల్ డైరెక్టర్ సునీత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థినులు కాపీ కొడుతూ పట్టుబడి డిబార్ అయినట్లు అధికారులు తెలిపారు.


