News September 4, 2024
విశాఖ జిల్లా నుంచి 68వేల ఫుడ్ ప్యాకెట్స్
వరద బాధితుల కోసం విశాఖ జిల్లా అధికార యంత్రాంగం 71,500 అల్పాహారం ప్యాకెట్లు, 68 వేల భోజనం ప్యాకెట్లు, 80,000 వాటర్ బాటిళ్లతో పాటు 48,500 రాత్రి భోజనం ప్యాకెట్లు సమకూర్చింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఫుడ్ ప్యాకెట్లతో పాటు బిస్కెట్లు, రొట్టెలు, కొవ్వొత్తులు సిద్ధం చేసి ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడ పంపించారు. ఈ ప్రక్రియను డీఆర్ఓ మోహన్ కుమార్ పర్యవేక్షించారు.
Similar News
News September 12, 2024
విశాఖ: సీజనల్ వ్యాధులపై ఇంటింటి సర్వే
ఇటీవల విస్తారంగా కూర్చుని నేపథ్యంలో జిల్లాలో వ్యాధులపై ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో వైద్యం అందజేయాలని ఆయన సూచించారు. జిల్లాలో 420 డెంగ్యూ కేసులు నమోదయినట్లు తెలిపారు.
News September 11, 2024
తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
ఈస్ట్ కోస్ట్ డివిజన్‌లోని పలు ప్రత్యేక రైళ్లును రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను, అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీకాకుళం రోడ్డు – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు.
News September 11, 2024
విశాఖ: సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్
ఉమ్మడి విశాఖ జిల్లాలో సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.