News January 29, 2025
విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా పేడాడ

విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా పేడాడ రమణకుమారి నియమిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు రిలీజ్ చేశారు. పేడాడ రమణకుమారి వైసీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా, బిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. విశాఖలో వైసీపీ మహిళల అధ్యక్షురాలిగా పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానన్నారు.
Similar News
News February 10, 2025
విశాఖలో పోలీస్ అధికారులతో సమీక్ష చేసిన డీజీపీ

విశాఖలో పోలీసుల పనితీరు చాలా బాగుందని క్రైమ్ రేట్ పెరగకూడదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలు విని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్‌తో పాటు డీసీపీలు పాల్గొన్నారు.
News February 9, 2025
విశాఖ: సముద్రంలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

విశాఖకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్ర తీరంలో ఆదివారం మృతిచెందారు. మృతులు కంచరపాలేనికి చెందిన మొక్క సూర్యతేజ, దువ్వాడకు చెందిన మొక్క పవన్‌గా గుర్తించారు. రాంబిల్లి బీచ్‌లో స్నానం చేయడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 9, 2025
విశాఖ: మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియకు బ్రేక్

విశాఖ జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 14 మద్యం షాపులు లాటరీ పద్ధతికి బ్రేక్ పడింది. సోమవారం లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తేదీని ఖరారు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.