News November 22, 2024
విశాఖ: జీవీఎంసీ క్రికెట్ జట్టు ఘన విజయం

విశాఖలో జింక్ మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో జీవీఎంసీ జట్టు ఘన విజయం సాధించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి తెలిపారు. గురువారం జరిగిన వీడీసీఏ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో GVMC క్రికెట్ జట్టు 47 పరుగుల తేడాతో MOV జట్టుపై ఘన విజయం సాధించిందన్నారు. మొదటిగా బ్యాటింగ్ చేసిన జీవీఎంసీ జట్టు 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అనంతరం MOV జట్టు 20 ఓవర్లలో 112 పరుగులు మాత్రమే సాధించి ఓటమి చెందిందన్నారు.
Similar News
News November 14, 2025
అయోధ్య తరహాలో సింహాచలం డిజైన్ లైటింగ్: గంటా

అయోధ్య తరహాలో సింహాచలానికి డిజైన్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సింహాచలంలో ఆయన పర్యటించారు. BRTS రోడ్డులో రూ.1.37 కోట్లు వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. అడవివరం-పాతగోశాల వరకు లైటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో సమస్యలు పెరిగాయని, త్వరలో నియామకం జరగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
News November 14, 2025
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఆత్మీయ వీడ్కోలు

ఏయూ వేదికగా నిర్వహించిన సిఐఐ సమ్మెట్లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు శుక్రవారం ఆత్మీయ వీడ్కోలు లభించింది. శుక్రవారం ఉదయం చేరుకున్న ఆయనకు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఆయన వాయుమార్గంలో ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు, అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు.
News November 14, 2025
లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించండి: DMHO

ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించాలని DMHO జగదీశ్వరరావు అన్నారు. తరచుగా మూత్ర విసర్జన, మానసిక స్థితిలో, కళ్ల దృష్టిలో మార్పు, బరువు తగ్గడం,బలహీనతగా ఉండటం, ఎక్కువగా దాహం కలగడం వంటి లక్షణాల ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. దగ్గరలో ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసుకోవాలన్నారు.


