News November 22, 2024
విశాఖ: జీవీఎంసీ క్రికెట్ జట్టు ఘన విజయం
విశాఖలో జింక్ మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో జీవీఎంసీ జట్టు ఘన విజయం సాధించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి తెలిపారు. గురువారం జరిగిన వీడీసీఏ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో GVMC క్రికెట్ జట్టు 47 పరుగుల తేడాతో MOV జట్టుపై ఘన విజయం సాధించిందన్నారు. మొదటిగా బ్యాటింగ్ చేసిన జీవీఎంసీ జట్టు 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అనంతరం MOV జట్టు 20 ఓవర్లలో 112 పరుగులు మాత్రమే సాధించి ఓటమి చెందిందన్నారు.
Similar News
News December 14, 2024
విశాఖ: 18 ఏళ్లు నిండని బాలుడిపై 11 కేసులు
విశాఖలోని కంచరపాలెంకు చెందిన బాల నేరస్థుడిని శుక్రవారం 3వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18 ఏళ్లు కూడా నిండని బాలుడిపై 11 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నేరస్థుడిపై చోరీ కేసులు నమోదు కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో నిందితుడిని మద్దిలపాలెంలో అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.
News December 13, 2024
పెందుర్తి: మెగా, అల్లు ఫ్యామిలీలు ఒక్కటే: బొలిశెట్టి
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ‘X’ ద్వారా స్పందించారు. ‘హైకోర్టు తీర్పు రాకముందే అల్లు అర్జున్‌ను జైలుకు తరలించాలన్నది పోలీసుల అత్యుత్సాహంగా కనిపిస్తోంది. సంధ్య థియేటర్‌కు హీరో వస్తున్న విషయం మీడియాలో 2రోజుల ముందే వచ్చింది. CP తెలియదనడం హాస్యాస్పదం. మెగా, అల్లు ఫ్యామిలీలు రెండు కాదు ఒక్కటే.. ఈ తప్పుడు కేసు వల్ల అనేక నోర్లు మూతపడతాయి’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
News December 13, 2024
విశాఖ: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహార కేసులు వంటివి రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చనన్నారు.