News December 1, 2024
విశాఖ: జూనియర్ న్యాయమూర్తులుగా ఇద్దరు యువతులు

ఏయూ డాక్టర్. బి.ఆర్.అంబేడ్కర్ లా కాలేజ్ విద్యార్థులు విందెల గీత భార్గవి, కెంబూరి నైమిశలు ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలలో విజయం సాధించి చిన్న వయస్సులో జడ్జిలుగా ఎంపికయ్యారు. ఈ విజయంపై కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె. సీతామాణిక్యం హర్షం వ్యక్తం చేశారు. గీత భార్గవి, నైమిశలు మరిన్ని ఉన్నత విజయాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 14, 2025
విశాఖ: భర్త వేధింపులకు నవ వధువు ఆత్మహత్య

గోపాలపట్నంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. నాగేంద్రబాబు, వసంత 11 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పోర్న్ వీడియోలకు బానిసైన నాగేంద్ర భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన వసంత శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని KGHకి తరలించారు.
News February 14, 2025
పాత గాజువాకలో యాక్సిడెంట్.. ఒకరు స్పాట్‌డెడ్

పాత గాజువాక జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. గాజువాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 14, 2025
నేవీ క్వార్టర్స్‌లో మహిళ అనుమానాస్పద మృతి

నేవీ అధికారుల క్వార్టర్స్‌లో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ క్వార్టర్స్‌లో కమల అనే మహిళ కొన్ని సంవత్సరాలుగా ఓ అధికారి ఇంట్లో పని చేస్తుంది. వారు పని మీద బయటకు వెళ్లారు. మూడు రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. గురువారం పక్క ఫ్లాట్ వాళ్లు కిటికీలోంచి చూడగా ఆమె బట్టలు లేకుండా కింద పడి ఉంది. దీంతో సెక్యురిటీకి సమాచారం అందించారు. మల్కాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.