News July 7, 2024
విశాఖ: జూన్లో పెరిగిన విమానాల సంఖ్య
విశాఖ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాల సంఖ్య జూన్ నెలలో పెరిగింది. గత ఏడాది జూన్లో 1,692 విమానాలు రాకపోకలు సాగించగా ఈ ఏడాది జూన్లో 1,704కు విమానాల సంఖ్య పెరిగింది. అయితే విమాన ప్రయాణికుల సంఖ్య స్పల్పంగా తగ్గింది. గతేడాది జూన్లో 2,54,490 మంది ప్రయాణించగా, ఈ జూన్లో 2,32,149 మంది ప్రయాణించారని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు నరేశ్ కుమార్, కుమార్ రాజా తెలిపారు.
Similar News
News January 17, 2025
ఈనెల 18న విశాఖ-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఈ నెల 18న విశాఖ నుంచి చర్లపల్లికి (08549/50)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు.18 సాయంత్రం విశాఖలో 7:45కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు మీదుగా మరుసటి రోజు తెల్లవారి 7 గంటలకు చర్లపల్లి చేరుతుంది. 2nd AC, 3rd Ac, స్లీపర్, జనరల్ ఉంటాయాన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
News January 16, 2025
విశాఖ: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 18న నిర్వహించబోయే ఎంపిక పరీక్ష కోసం విశాఖ కలెక్టరేట్లో సమీక్షా నిర్వహించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పరీక్ష కేంద్రాలు, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలలోని 39 కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పరీక్షకు 9080 మంది హాజరు కానున్నారు.
News January 16, 2025
నక్కపల్లి: బాలుడిని కాపాడబోయి మృత్యువాత పడిన యువకుడు
ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో <<15167020>>బాలుడిని<<>> కాపాడబోయిన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈనెల 15వ తేదీన సముద్రతీరంలో బాలుడు మునిగిపోతుండగా కాపాడడానికి వెళ్లిన మణికంఠ అనే యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన యువకుడు గురువారం నక్కపల్లి మండలం చినతీనార్ల సముద్రతీరానికి కొట్టుకు వచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.