News June 14, 2024

విశాఖ: జూలై 29 నుంచి ప్రత్యేక లోక్ అదాలత్

image

సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసుల పరిష్కారం కోసం జూలై 29 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్‌లు నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ.గిరిధర్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. కేసులు రాజీ చేసుకునేందుకు కక్షిదారులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు.

Similar News

News September 20, 2024

వైసీపీని రద్దు చేయాలని కోరుతాం: గంటా

image

జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదని, వైసీపీని రద్దు చేస్తే దేశానికి మంచిదని ఎలక్షన్ కమిషన్‌ను కోరనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.ఆనందపురంలో శుక్రవారం జరిగిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదమైన లడ్డూలో జంతువు కొవ్వు అవశేషాలున్నట్టు తేలడంతో హిందూ సమాజం నివ్వెర పోయిందన్నారు.

News September 20, 2024

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం రమేశ్

image

తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఈ సంఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

News September 20, 2024

విశాఖ: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘మోకా’కు చోటు

image

మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. విశాఖకు చెందిన విజయ్ కుమార్ చిరుధాన్యాలతో చిత్రాలను, బొమ్మలను తయారుచేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల మిల్లెట్స్‌తో తయారు చేసిన సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని అమరావతిలో అయనకు బహూకరించారు. వివిధ చోట్ల జరిగిన జీ- 20 సదస్సులో ఆయన తయారుచేసిన మిల్లెట్ చిత్రాలు ప్రదర్శించారు.