News June 23, 2024
విశాఖ: జూలై 8 నుంచి ఎంఎస్సీ అప్లైడ్ కెమిస్ట్రీ పరీక్షలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఎస్సీ అప్లైడ్ కెమిస్ట్రీ 4వ సెమిస్టర్ పరీక్షలు జూలై 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జె.రత్నం తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 8న ఇండస్ట్రీస్ బేస్డ్ ఆర్గానిక్ రా మెటీరియల్స్, 9న ఫైన్ కెమికల్స్, 10న పాలిమర్స్ అండ్ ప్లాస్టిక్స్, 11న ఎలెక్టివ్స్, 12న ఇంటలెక్చువల్ ఐ.పీ.ఆర్ పరీక్షలు జరుగుతాయి.
Similar News
News November 27, 2025
గంజాయి కేసులో ఐదుగురికి జైలు శిక్ష: VZM SP

డ్రగ్స్ కేసులో ఐదుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మీనాదేవి గురువారం తీర్పు వెలువరించారని విజయనగరం ఎస్పీ దామోదర్ తెలిపారు. విజయనగరంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్లో జూలై 26, 2024న పాత రైల్వే క్వార్టర్స్ వద్ద 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను సమర్పించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.
News November 27, 2025
VZM: బొత్స భద్రత లోపంపై విచారణకు ఆదేశం

పైడితల్లి సిరిమానోత్సవంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు కేటాయించిన వేదిక కూలిన ఘటనపై విచారణకు GAD ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా కలెక్టర్ను ఆదేశించారు. బొత్స ప్రొటోకాల్, భద్రతా లోపంపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని ఆదేశిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వేదిక కూలిన ఘటనలో MLC సురేష్ బాబు, ఎస్సై, మరో బాలికకు గాయాలైన సంగతి తెలిసిందే.
News November 26, 2025
ఐదుగురికి జరిమానా.. మరో ఐదుగురికి జైలు శిక్ష: VZM ఎస్పీ

విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ & గంట్యాడ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులు బుధవారం పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితులను విజయనగరం ఎక్సైజ్ కోర్టులో హాజరుపర్చగా, 5 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, మరో 5 మందికి 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ శ్రీవిద్య తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.


