News February 27, 2025

విశాఖ జూలో పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు

image

విశాఖ జూపార్క్‌లో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మార్చి 2వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జూ పార్కు బయోస్కోఫ్ వద్ద పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జూ క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. 1వ క్లాస్ నుంచి పీజీ వరకు విద్యార్థులు పోటీలలో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు జూ కార్యాలయాన్ని సంప్రదించాలని, జీవవైవిద్య పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News March 23, 2025

క్షయ వ్యాధి నివారణకు కలిసికట్టుగా పనిచేయాలి: జిల్లా

image

ఈ నెల 24 న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని వైద్య సూపరింటెండెంట్‌లతో జిల్లా కలెక్టర్ ఎంఎన్‌ హరింధిర ప్రసాద్ సమావేశమయ్యారు. క్షయ వ్యాధిని అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. క్షయ వ్యాధి సోకిన వ్యక్తులను వారి కుటుంబ సభ్యుల పట్ల వివక్ష చూపరాదని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారి కలెక్టర్ ఆఫీస్ నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు.

News March 22, 2025

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

image

సామర్లకోట, పిఠాపురం మధ్య రైల్వే నాన్ ఇంటర్ లాకింగ్ పనుల వలన విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం సందీప్ శనివారం తెలిపారు. విశాఖ -కాకినాడ పాసెంజర్ (17267/68), విశాఖ – రాజమండ్రి పాసెంజర్ (67285/86), విశాఖ -గుంటూరు ఉదయ్ ఎక్స్ ప్రెస్ (22875/76) రైళ్ళు మార్చి 24న రద్దు చేశామన్నారు. విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239/40) రైళ్ళు మార్చి 24, 25న రద్దు చేశామన్నారు.

News March 22, 2025

విశాఖ: పేద‌రిక నిర్మూల‌నకు పి-4 దోహ‌దం: కలెక్టర్

image

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన పి-4 విధానం పేద‌రిక నిర్మూల‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని, అధికారులు దానిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలని జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు సంఘాల ప్ర‌తినిధులు, అధికారుల‌తో శ‌నివారం క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. పి-4 విధానం ద్వారా పేద‌రిక నిర్మూల‌న సాధ్య‌ప‌డుతుందని, అంద‌రూ దీని ఆవ‌శ్య‌క‌త‌ను తెలుసుకొని భాగ‌స్వామ్యం కావాల‌న్నారు.

error: Content is protected !!