News March 8, 2025
విశాఖ జూలో రేపు మహిళా జీవవైవిధ్య నడక

విశాఖ జంతు ప్రదర్శనశాలలో శనివారం మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా జీవవైవిధ్య నడక ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల నిర్వహించనున్నట్లు జూ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు అధికారులను సంప్రదించాలని కోరారు.
Similar News
News March 27, 2025
విశాఖ మేయర్ పీఠంపై ‘యాదవుల’ పట్టు..!

జీవీఎంసీ మేయర్‌గా గొలగాని హరి వెంకట కుమారిని కొనసాగించాలని విశాఖ జిల్లా యాదవ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, ఆ స్థానాన్ని యాదవులకే ఇవ్వాలన్నారు. జీవీఎంసీలో 22 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఉన్నారన్నారు. ఏ సామాజిక వర్గంలో ఇంత మంది కౌన్సలర్లు లేరని గుర్తుచేశారు.
News March 27, 2025
పెదగంట్యాడలో ఫ్రీ కోచింగ్.. ఎస్సీలు మాత్రమే అర్హులు

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్ గా ఉపాధి కొరకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నేక్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ గురువారం తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 18-44 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువతకు మాత్రమే 3 నెలల శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్‌లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్దగంట్యాడలోని నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.
News March 27, 2025
సింహాచలంలో అప్పన్న స్వామికి నిత్య కళ్యాణం

సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామికి గురువారం ఉదయం నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. బెల్లం, జీలకర్రతో పాటు ఊరేగిచారు. 108 స్వర్ణ పుష్పాలతో స్వామివారిని పూజించి భక్తులకు వేదాశ్వీరచనాలు, శేష వస్త్రాలు అందజేశారు. భక్తులు భారీగా తరలివచ్చారు. ఈవో సుబ్బారావు ఇతర సిబ్బంది పర్యవేక్షించారు. అన్నదానం ఏర్పాట్లు చేపట్టారు.