News November 24, 2024
విశాఖ జూలో సండే సందడి
ఇందిరా గాంధీ జూపార్క్‌ను ఆదివారం 13,650 మంది సందర్శకులు వచ్చినట్లు జూ క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున వనయాత్రలకు వచ్చారన్నారు. రూ.9,61,724 ఆదాయం వచ్చిందని జూ క్యూరేటర్ తెలిపారు. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున్న సందర్శకులు ఇందిరా గాంధీ జూపార్క్‌కు రావడంతో సందడి వాతావరణం నెలకొంది.
Similar News
News December 11, 2024
సీఎంతో సమావేశంలో అనకాపల్లి, విశాఖ కలెక్టర్లు
వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో రెండు రోజుల పాటు జరుగుతున్న కలెక్టర్లు సమావేశంలో విశాఖ, అనకాపల్లి కలెక్టర్లు ఎం.ఎన్ హరిందర్ ప్రసాద్, విజయ కృష్ణన్ పాల్గొన్నారు. రెండు రోజుల సమావేశంలో భాగంగా కలెక్టర్లకు స్వర్ణాంధ్ర విజన్ 2047 సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రవేశపెట్టనున్న పలు పథకాల అమలపై కూడా చర్చించనున్నారు.
News December 11, 2024
గూగుల్‌తో ఎంవోయూ చేసుకున్నాం: సీఎం చంద్రబాబు
అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందు విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ ప్రతినిధులు పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గూగుల్ విశాఖకు వచ్చాక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్‌టెక్, సీకేబుల్ వచ్చాక ప్రపంచానికే విశాఖ సర్వీస్ సెంటర్ అవుతుందని పేర్కొన్నారు.
News December 11, 2024
విశాఖ: విజయవంతమైన వెల్ డెక్ రికవరీ ట్రయల్స్
విశాఖ తీరంలో నిర్వహించిన వెల్ డెక్ రికవరీ ట్రయల్స్ విజయవంతమైనట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. నావికాదళం సహకారంతో ఈనెల 6వ తేదీన గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా క్రూ మాడ్యూల్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు అక్కడ విధులు ముగించుకుని క్రూ మాడ్యూల్లోనే భూమిపైకి తిరిగి వస్తారు. వీటిని సముద్రంలోకి పడేటట్లు చేస్తారు. అక్కడనుంచి వ్యోమగాములు సురక్షితంగా వస్తారు.