News November 17, 2024

విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన 10,006 మంది 

image

విశాఖలో ఇందిరా గాంధీ జూపార్క్ సందర్శకులతో ఆదివారం కిటకిటలాడింది. కార్తీక మాసం కావడంతో వనయాత్రలకు పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. ఆదివారం ఒక్కరోజే 10,006 మంది పర్యాటకులు పార్క్‌ను సందర్శించారు. ఈ ఒక్కరోజు రూ.7,75,530 ఆదాయం వచ్చినట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు.

Similar News

News December 10, 2024

విశాఖలో యువకుడి ప్రాణం తీసిన రూ.2 వేలు

image

లోన్‌యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. విశాఖ కలెక్టరేట్ సమీపంలోని అంగడిదిబ్బకు చెందిన నరేంద్ర(21) ఓ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. నగదు అంతా కట్టి చివరకు రూ.2 వేలు పెండింగ్‌లో ఉంది. అది కట్టలేదని అతడి ఫొటోలను మార్ఫింగ్ చేశారు. 40 రోజుల క్రితమే పెళ్లి అయిన తన భార్యకు సైతం వాటిని పంపారు. మనస్తాపానికి గురైన నరేంద్ర ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 10, 2024

విశాఖ: హస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు పరార్

image

అల్లిపురం మహారాణిపేట పోలీసు పరిధి, అంథోని బోర్డింగ్ హోమ్ నుంచి నలుగురు విద్యార్థులు పరారైనట్లు హోమ్ ఇన్‌ఛార్జ్ కచ్చా వేళంగిరి ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రార్థనలకు చర్చికి వెళ్లిన గుడాల రఘ, బెడపాటి చరణ్, నక్కాల కిరణ్ కుమార్, కార్తీక్ సాయంత్రం అయిన రాలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా గోడ దూకి పారిపోయినట్లు గుర్తించారు. విశాఖ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే, ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో వెదికారు.

News December 10, 2024

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం రూ.2.81కోట్లు

image

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 39 రోజులకు గాను ఆలయ అధికారులు ఈఓ త్రినాథ్ రావు పర్యవేక్షణలో సోమవారం లెక్కించారు. మొత్తం రూ.2,81,93,913 ఆదాయం వచ్చింది. బంగారం 126 గ్రాముల 300 మిల్లీగ్రాములు, వెండి 15 కిలోల 140 గ్రాములు, 9దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.